బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత: వంద కోట్ల వైపు రామాయణ సినిమా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్ లో నటించిన రామాయణ చిత్రం బాక్సాఫీసు వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ ఐదున విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా వస్తున్నాయని, ఇప్పటికే వంద కోట్ల మార్కుకు చేరువవుతోందని విశ్లేషకులు తెలిపారు. హిందీ వెర్షన్ తో పాటు ప్రీమియం ఫార్మాట్ షోలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోందని సమాచారం.