నర్సీపట్నంలో శ్రీ నందన హాస్పిటల్ ప్రారంభం.. వైద్య సేవలు అందుబాటులోకి

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నంలో శ్రీ నందన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, నర్సీపట్నం ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం స్థానికంగానే అందాలని ఆకాంక్షించారు. ఇకపై ప్రజలు వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేదని, అత్యాధునిక సదుపాయాలతో కూడిన వైద్యం అందుబాటులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.