విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసే అభాకస్ కార్యక్రమం
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఎస్వీఎన్ లేక్ ప్యాలెస్ లో విద్యార్థులకు అభాకస్ కార్యక్రమం నిర్వహించినట్లు చైర్మన్ ముకేశ్ మారుతీరాజే తెలిపారు. విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తేజ, అశోక్, శంకర్ రెడ్డి, జగదీష్ బాబు తదితరులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.