వైద్య విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ స్టైఫండ్ పెంపు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: అమరావతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. స్టైఫండ్ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు పది శాతం, పీజీ వైద్య విద్యార్థులకు ఐదు శాతం, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు మూడున్నర శాతం స్టైఫండ్ పెంచారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏడాదికి అదనంగా కోట్ల భారం పడనుంది.