బెంగళూరులో రాపిడో రైడర్ బరితెగింపు: యువతితో అసభ్య ప్రవర్తన కలకలం
రిపోర్టర్: సతీష్
స్థలం: Bengaluru
బెంగళూరు నగరంలో రాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాంటూ ఓ యువతి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రాప్ చేసిన తర్వాత కూడా రైడర్ తన చేయి పట్టుకుని భయపెట్టాడని, భద్రతా ప్రమాదాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు నగర పోలీసులు వివరాలు కోరగా, రాపిడో సంస్థ స్పందించి సదరు డ్రైవర్ను ప్లాట్ఫారమ్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు వెల్లడించింది.