దివాన్ చెరువులో కెమికల్ డ్రమ్ముల దగ్ధం, తీవ్ర కలకలం
రిపోర్టర్: రాజేష్
స్థలం: తూర్పు గోదావరి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు పడేసిన కెమికల్, యాసిడ్ డ్రమ్ముల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విపరీతమైన పొగ, దుర్వాసన రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కోమటి చెరువు వద్ద వందలాది కెమికల్ డ్రమ్ములు ఉన్నాయని, అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.