అచ్యుతాపురంలో వినాయకుడి లడ్డూ వేలంలో భక్తుల సందడి
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
అచ్యుతాపురం మండలంలో సెజ్ పునరావాస కాలనీలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయకుడి లడ్డూ వేలం శనివారం సందడిగా సాగింది. యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుడు రాజాన విజయకుమార్ రూ.12 వేలతో లడ్డూను దక్కించుకున్నారు. వినాయకుడి లడ్డూ దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.