ఇజ్రాయెల్ రాజకీయాల్ లో సంచలనం: బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అగ్రనేత అహ్మద్ టిబి సంకేతాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాయింట్లిస్ట్ మద్దతు ఇస్తుందని ఆ దేశ సీనియర్ అరబ్ నేత అహ్మద్ టిబి తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం ఇజ్రాయెల్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.