ఢిల్లీలో మహిళలకు భారీ ఊరట: పింక్ ఆటోల బుకింగ్‌కు సరికొత్త సదుపాయం
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
ఢిల్లీ నగరంలో మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల రవాణా భద్రతను మెరుగుపరచడంతో పాటు వారికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో సరికొత్త దుర్గా ఈ-ఆటో పథకాన్ని ప్రవేశపెట్టినట్లు రవాణా మంత్రి డాక్టర్ పంకజ్ కుమార్ సింగ్ వెల్లడించారు. రైడ్-హెయిలింగ్ యాప్‌ల ద్వారా పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని, దీనికోసం కంపెనీలు ఎలాంటి ఆన్‌బోర్డింగ్ లేదా సబ్స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరతామని ఆయన స్పష్టం చేశారు.