రైల్వేకోడూరులో అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వే కోడూరు

శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా కోడూరు ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు ఆయన పట్టణంలోని పాత బజారులో ఉన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు, నాయకులు ఘనంగా పాల్గొన్నారు.