బిగ్ బాస్ హౌస్లో తీవ్ర ఉద్రిక్తత: కంటెస్టెంట్ల మధ్య ఘర్షణ

రిపోర్టర్: అశోక్ స్థలం: చెన్నై

బిగ్ బాస్ తమిళం పదో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత హౌస్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు తాజా ప్రోమో స్పష్టం చేస్తోంది. చెప్పులు పెట్టే విధానంపై జరిగిన చిన్న వాదన కాస్తా టీటీఎఫ్ వాసన్, అక్షిత మరియు జాసన్ మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసిందని మేకర్స్ వెల్లడించారు. ఇతర కంటెస్టెంట్లు జోక్యం చేసుకుని వారిని విడదీయాల్సి వచ్చిందని, దీంతో రాబోయే ఎపిసోడ్లో మరింత రసవత్తరంగా డ్రామా నడవనుందని షో వర్గాలు పేర్కొన్నాయి.