ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోడెల శివరాం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నరసరావుపేట
నరసరావుపేటలో యంగ్‌స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వినాయకుని చతుర్దశ మంగళహారతి పూజా కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ కోడెల శివరాం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. భగవంతుని ఆశీస్సులు తీసుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.