వైద్యరంగంలో గేమ్‌ఛేంజర్‌గా సంజీవని ప్రాజెక్ట్: సీఎం చంద్రబాబు ఆదేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆంధ్రప్రదేశ్

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ‘సంజీవని’ ప్రాజెక్టును ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో అమలుచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సులో వైద్యారోగ్యశాఖపై ఆయన సమీక్షించారు. ప్రజారోగ్యం కోసం ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్ ద్వారా వ్యాధులు రాకుండా చూస్తే చికిత్స వ్యయం తగ్గుతుందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో సైబర్‌, ఆర్థిక నేరాలు పెరగడంపై అధికారులను హెచ్చరించారు.