కృత్రిమ మేధ ఆధారంగా భవిష్యత్ వృద్ధి సాధిస్తామన్న శ్రీధర్ వెంపు

రిపోర్టర్: రమేష్ స్థలం: చెన్నై

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో తన ప్రయాణంలో మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కృత్రిమ మేధ ఆధారిత జియా చాట్ వేదికను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంపు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సరికొత్త సేవలను విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఈఆర్పీ సొల్యూషన్స్ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.