జన్నారంలో కనీస వసతులు లేక రోడ్డున పడ్డ చిరువ్యాపారుల గోడు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో చిరు వ్యాపారులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు విక్రయించడానికి వస్తున్న వ్యాపారులు ప్రధాన రహదారి పక్కనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ కనీస తాగునీరు, మూత్రశాలల వసతి లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు తక్షణమే తగిన సదుపాయాలు కల్పించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.