రాష్ట్రంలో ముగియనున్న మండల పరిషత్తులు మరియు జడ్పీపీల పదవీకాలం

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 650 మండల పరిషత్తుల పాలకవర్గాల పదవీకాలం బుధవారంతో ముగియనుండగా, జిల్లా ప్రజా పరిషత్తుల పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పరిపాలన ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జడ్పీపీలకు కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనుండగా, త్వరలోనే కొత్త పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.