అటవీశాఖ తీరుపై జనసేన ఆగ్రహం: ప్రమాదకర కందకాలపై హెచ్చరిక

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ముర్రిమడుగు గ్రామంలోని దళితుల ఇళ్ల పక్కనే అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వడంపై జనసేన నాయకుడు చుంచు రాజ్ కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కందకాల్లో పడి ఎవరైనా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రజల భద్రతను విస్మరిస్తే ఊరుకోమని స్పష్టం చేస్తూ తక్షణమే పూడ్చివేయాలని డిమాండ్ చేశారు.