రవీంద్ర జడేజా వన్డే భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన కోచ్ సాయిరాజ్ బహుతులే
రిపోర్టర్: సతీష్
స్థలం: గౌహతి
భారత సీనియర్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డే భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే తెరదించారు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో జడేజాకు స్థానం ఉందని, అతడి ఆల్రౌండ్ నైపుణ్యాలను జట్టు మేనేజ్మెంట్ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన స్పష్టం చేశారు. జడేజా బ్యాటింగ్ నైపుణ్యాలు, అపారమైన అనుభవం జట్టుకు కొండంత బలంగా మారుతాయని గౌహతిలో జరిగిన మీడియా సమావేశంలో సాయిరాజ్ బహుతులే వివరించారు.