భారత మార్కెట్లోకి ఎంఐవీఐ వన్ ఫైవ్జీ స్మార్ట్ఫోన్ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
భారతీయ మార్కెట్లోకి ప్రముఖ ఆడియో బ్రాండ్ ఎంఐవీఐ తన మొదటి స్మార్ట్ఫోన్ ఎంఐవీఐ వన్ ఫైవ్జీని ప్రవేశపెట్టినట్లు టెక్ నిపుణులు తెలిపారు. దీని ప్రారంభ ధర రూ. 14,999గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ఫోన్ 6.75 అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 4 Gen 2 చిప్సెట్ మరియు 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన ఫీచర్లతో వస్తోందని, స్టాక్ ఆండ్రాయిడ్ అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.