అభిషేక్ బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఊహించని షాక్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: పశ్చిమ బెంగాల్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి కలకత్తా హైకోర్టులో చుక్కెదురైంది. అమ్తలాలోని పార్టీ కార్యాలయ కూల్చివేత వ్యవహారంలో ఇచ్చిన మధ్యంతర స్టేను ఎత్తివేస్తామని కోర్టు హెచ్చరించింది. పదేపదే గడువు కోరడంపై జస్టిస్ సువ్రా ఘోష్ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణను సెప్టెంబర్ 22కి వాయిదా వేస్తూ, ఆ రోజు కూడా వాదనలకు సిద్ధంగా లేకపోతే స్టే పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.