నర్సంపేటలో యథేచ్ఛగా బెల్ట్ షాపుల దందా: అధికారుల ఉదాసీనతపై ప్రజాగ్రహం

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట పట్టణంలో అక్రమ మద్యం బెల్ట్ షాపుల సంఖ్య సెంచరీ దాటడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ కిరాణా దుకాణాల కంటే ఎక్కువగా మద్యం విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్, ఏసీపీ కార్యాలయాల సమీప వీధుల్లోనూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నిబంధనలను గాలికొదిలేసి సాగుతున్న ఈ అక్రమ దందాపై ఎక్సైజ్ అధికారులు తక్షణమే కొరడా ఝుళిపించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.