విద్యార్థులకు గుడ్ న్యూస్: కొల్లాపూర్ పీజీ కేంద్రంలో స్పాట్ అడ్మిషన్లు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కొల్లాపూర్

కొల్లాపూర్ పీజీ కేంద్రంలో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. అశోక్ కుమార్ తెలిపారు. రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ధ్రువపత్రాలతో నేరుగా కేంద్రాలను సంప్రదించాలని కోరారు.