రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడిపై హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నత స్థాయి సమీక్ష

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈగల్ టీమ్స్‌తో జూమ్ కాల్ ద్వారా మాట్లాడిన ఆమె, గంజాయి నిర్మూలనలో సాధించిన పురోగతిని పరిశీలించారు. భావితరాల భవిష్యత్తును కాపాడేందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఈగల్ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. అలాగే గంజాయి సమాచారం కోసం 1972 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.