'పిచ్చి పిచ్చి డ్రామాలేస్తున్నావా.. కూర్చోరా': ఎమ్మెల్యే శిరీష ఫైర్
రిపోర్టర్: సునీల్
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం అడ్డతీగలలో జరిగిన టీడీపీ అంతర్గత సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే శిరీష తీవ్ర ఉద్రిక్తత మధ్య కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడకుండా తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆమె మండిపడ్డారు. పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడితే ఒక్కొక్కరి తాట తీస్తానని హెచ్చరించడంతో అబ్జర్వర్ల సమక్షంలో జరిగిన ఈ ఘటన పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.