మోతరాంగనపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారంలో జోరు
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
గంగాధరనెల్లూరు మండలం మోతరాంగనపల్లి గ్రామంలో వైయస్సార్సీపి ఎంపీటీసీ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన హరీష్ను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. గ్రామస్తులంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.