అయోధ్య రామ మందిర సిబ్బందికి పూర్తి స్థాయి పోలీసు తనిఖీలు

రిపోర్టర్: సతీష్ స్థలం: అయోధ్య

అయోధ్య రామ మందిరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వెలువడింది. ఇందులో భాగంగా మందిరంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మరియు సిబ్బంది అందరికీ వంద శాతం పోలీసు తనిఖీలు, ప్రవర్తనా ధృవీకరణ పత్రాలు తప్పనిసరి చేశామని వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో పాటు విస్తృత స్థాయి విచారణ చేపడుతున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు గురువారం స్పష్టం చేశారు.