మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వాడకంతో కిడ్నీలు దెబ్బతింటాయని హెచ్చరిక
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
చిన్న నొప్పులకు కూడా ఎలాంటి వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ మరియు యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు నాన్ స్టెరోడియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడకంపై సీడీఎస్సీఓ కీలక సూచనలు చేసింది. సొంత వైద్యం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని, వృద్ధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.