తెలంగాణ ఎన్నికల బరిలో దిగేందుకు కదంతొక్కిన ఆధార్ పార్టీ
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన ఆధార్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు శేషగిరిరావు పాల్గొన్నారు. రాబోయే 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుచ్చకాయల దేవేందర్ నేతృత్వంలో ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరిస్తామని నేతలు స్పష్టం చేశారు.