ఏలూరులో భారీ సైబర్ మోసం: బాధితుడికి నగదు అందజేసిన పోలీసులు
రిపోర్టర్: విజయ్
స్థలం: Eluru
ఏలూరులో రూ.67.67 లక్షల సైబర్ మోసం కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. VL బుక్ లింక్ పేరుతో జరిగిన ఈ మోసంలో, బాధితుడికి రూ.19.54 లక్షలను తిరిగి అందజేశారు. మరో రూ.16 లక్షలను ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో 15 మంది నిందితులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. గుర్తుతెలియని లింకులు, పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని ఏలూరు పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.