ఓటర్లకు భారీ ఊరట: తొలగిపోయిన పేర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్

రిపోర్టర్: గోపి స్థలం: గుంటూరు

ఓటర్ల జాబితా నుంచి పొరపాటున పేర్లు తొలగిపోయిన అర్హులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని గుంటూరు కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. అక్టోబర్ 8, 9, 10 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన ఓటర్ల వివరాలను ఇంటింటి సర్వే ద్వారా పునఃపరిశీలించి, అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.