ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ పిలుపు
రిపోర్టర్: సురేష్
స్థలం: అహ్మదాబాద్
దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఏపీకి వచ్చాయని, గుజరాత్ తో కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని గుజరాత్ పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు.