కాంగ్రెస్ పాలనలో వేయి మంది రైతులు ఆత్మహత్యలంటూ కేటీఆర్ ధ్వజం

రిపోర్టర్: రమేష్ స్థలం: ఆదిలాబాద్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేయి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే అన్నదాతల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సాయం అందజేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.