మహారాష్ట్రలో ప్రముఖ పుణ్యక్షేత్రం: రోగనాశకుడిగా భక్తుల కొంగుబంగారం ఉన్కేశ్వర్ మహాదేవుడు
రిపోర్టర్: అశోక్
స్థలం: Nanded
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకాలో వెలసిన శ్రీ ఉన్కేశ్వర్ మహాదేవ ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. వనవాస సమయంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈ శివలింగ క్షేత్రంలో సహజంగా ఏర్పడిన వేడినీటి సరోవరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడి ఉష్ణగుండంలో స్నానమాచరించి, రోగనాశకుడైన మహాదేవుడిని దర్శించుకోవడం ద్వారా చర్మవ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.