బిహార్లో వరద బాధితురాలి ఆగ్రహం, నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: సతీష్
స్థలం: బిహార్
బిహార్లో నెల రోజులుగా వరదలతో అల్లాడిపోతున్నా తమను పట్టించుకోలేదంటూ ఓ మహిళ చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. కనీసం ఒక్క అధికారైనా తమ గ్రామానికి రాలేదని మండిపడింది. ఓట్ల కోసం వస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించింది. ఈ కష్టకాలంలో ప్రభుత్వం స్పందించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.