పౌల్ట్రీ రంగం డిమాండ్: కిలో లైవ్ చికెన్ ధర రూ.110గా నిర్ణయించాలి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

దేశవ్యాప్తంగా లైవ్ చికెన్ ధరల్ లో ఏకరూపత ఉండాలని జాతీయ పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ప్రాంతాల్ లో కిలో లైవ్ చికెన్ ధర రూ.110గా నిర్ణయించి ఒకే విధమైన ధరల విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో వారు విజ్ఞప్తి చేశారు. కోళ్ల దాణా ధరలను తగ్గించడంతో పాటు, ఎల్నినో ప్రభావం నుంచి పౌల్ట్రీ రంగాన్ని రక్షించేందుకు ప్రత్యేక సహకారం అందించాలని పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు.