డీజిల్ మరియు ఏటీఎఫ్ ఎగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ ఎగుమతులపై విండ్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డీజిల్ ఎగుమతులపై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.20 నుంచి రూ.16కి తగ్గించగా, ఏటీఎఫ్ సుంకాన్ని రూ.15 నుంచి రూ.10.5కి కుదించారు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పన్ను రేట్లతో పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని మాత్రం లీటరుకు రూ.0.5 వద్దే యథాతథంగా కొనసాగించినట్లు అధికారులు స్పష్టం చేశారు.