డియర్ ఆస్ట్రోనాట్ సినిమా పాటను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

సౌమిత్, శ్రేయసిసేన్ జంటగా కార్తీక్ భాగ్యరాజ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ ఆస్ట్రోనాట్ సినిమాలోని ఒక పాటను అగ్ర దర్శకుడు శేఖర్ కమ్ముల శుక్రవారం విడుదల చేశారని చిత్ర యూనిట్ తెలిపింది. ఆస్ట్రోనాట్ కావాలనే ఉన్నత లక్ష్యంతో వస్తున్న ఈ చిత్రం మంచి ప్రయోగమని, పెద్ద కలలు కనేవారికి స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల కొనియాడారు. నవంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.