ఓడలరేవులో అర్నబ్ తుపాను బీభత్సం: రెండు వందల బోట్లు ధ్వంసం

రిపోర్టర్: సురేష్ స్థలం: కోనసీమ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో అర్నబ్ తుపాను తీవ్ర విధ్వంసం సృష్టించిందని మత్స్యకారులు వాపోయారని వైసీపీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పినిపే శ్రీకాంత్ తెలిపారు. సముద్రంలో తుపాను ఉద్ధృతి పెరగడంతో రాత్రి వేళ వీచిన ఈదురు గాలులకు హార్బర్లో లంగర్ వేసి ఉన్న సుమారు రెండు వందల ఫిషింగ్ బోట్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోట్లు విరిగిపోయి నీట మునిగిపోవడంతో తమ జీవనాధారం కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.