కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిప్పులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేయగా, దానిని తిప్పికొట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పార్టీ అధ్యక్షులతో ప్రెస్మీట్లు నిర్వహించి ప్రతిపక్షాల తీరును ఎండగట్టింది. రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జ్ఞానేశ్ కుమార్ తొలగింపును డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ సిద్ధమైంది.