వావిళ్లపల్లిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా గణేశుడి శోభాయాత్ర

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

వావిళ్లపల్లి గ్రామంలోని గాంధీనగర్లో గణేశుడి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాల నడుమ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీధులన్నీ గణనాథుడి నామస్మరణతో మార్మోగగా యువత, మహిళలు నృత్యాలు చేశారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.