శ్రీకాకుళంలో రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని బర్మా కాలనీ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఐదుగురు యువకులను ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బహిర్భూమికి వెళ్తూ పట్టాలు దాటుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.