తాప్పాచబుత్రలో తాగునీటి పైప్లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

కార్వాన్ నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. తాప్పాచబుత్ర, యూసుఫ్ నగర్, తల్లాగడ్డ, అఫ్సర్ ఖాన్ కాలనీ, గోల్కొండ అలాగే బడా బజార్ పరిసర ప్రాంతాలలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మరియు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన కొనసాగుతున్న పైప్లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష జరిపి పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.