జార్ఖండ్లో కరం పండుగ వేడుకల్లో విషాదం నదిలో కొట్టుకుపోయి ఐదుగురు మృతి
రిపోర్టర్: గోపి
స్థలం: జార్ఖండ్
జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లా బొకాయ గ్రామంలో గిరిజనులు నిర్వహించిన సాంప్రదాయ కరం పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పూజించిన చెట్టు కొమ్మను కోయల్ నదిలో నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు నది ఉద్ధృత ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జాలర్ల సహాయంతో మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.