ఐరాలలో ఘనంగా మేదరమెట్ల మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
ఐరాల మండలం తిరుమలయ్యగారిపల్లి గ్రామంలో క్లస్టర్ ఇంచార్జ్ మేదరమెట్ల మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గ్రామస్తులు కొనియాడారు. అనంతరం సుమారు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.