గిరిజనుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా గుమ్మలక్ష్మీపురంలో జనసేన అభ్యర్థి ముమ్మర ప్రచారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుమ్మలక్ష్మీపురం
గుమ్మలక్ష్మీపురం మండలంలో జడ్పిటిసి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాలక క్రాంతికుమార్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో గడపగడపకూ తిరుగుతూ తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. గిరిజనుల హక్కులు మరియు చట్టాల పరిరక్షణ కోసం చట్టసభల్లో గళం వినిపిస్తానని హామీ ఇస్తూ ప్రజలను అభ్యర్థించారు.