పరిషత్ ఎన్నికల పోలింగ్ పూర్తి: రాష్ట్రంలో 70.02 శాతం ఓట్లు నమోదు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల్ లో 70.02 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ఎస్ఈసీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 82.51 శాతం, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 62.01 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. రేపు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.