మురసు తుపాను ప్రభావం: విజయవాడ విమానాశ్రయంలో పన్నెండు సర్వీసులు రద్దు
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
మురసు తుపాను కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పన్నెండు సర్వీసులు రద్దు అయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలకు వెళ్లే ఇండిగో మరియు ఎయిరిండియా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వాతావరణం పూర్తిగా అనుకూలించే వరకు ప్రయాణికులు ఎయిర్లైన్స్ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.