కిడ్నీ బాధితుడికి డయాలసిస్ చికిత్స కోసం లక్ష ఎల్ఓసి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని 18వ వార్డుకు చెందిన పి. ఓంప్రకాష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో అత్యవసర డయాలసిస్ చికిత్స నిమిత్తం రూ.1 లక్ష విలువైన ఎల్ఓసీని అందజేశారు. ఈ సహాయం పట్ల బాధితుని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్‌కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కామిశెట్టి భాస్కర్, గుగులోతు శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.