యాదగిరిగుట్ట మున్సిపల్ సమావేశంలో లెక్కల వివాదంపై కౌన్సిలర్ల ధర్నా

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం తీవ్ర రసాభాసగా మారింది. పారిశుధ్యం మరియు ఇతర కార్యక్రమాల ఖర్చులపై లెక్కలు చూపడం లేదంటూ ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వ్యయంపై సమగ్ర విచారణ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.