నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: ఎవరూ శాశ్వతంగా ఆక్రమించలేరని స్పష్టీకరణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

నిరసనలు తెలిపే హక్ కు అందరికీ ఉందని, అయితే ఏ నిరసన బృందం కూడా నిర్ణీత స్థలాన్ని శాశ్వతంగా ఆక్రమించుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు ప్రధాన జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. ఢిల్లీలో నిరసనల ప్రభావంపై వ్యాపార సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నిరసనల వల్ల ఇతర పౌరుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, నిర్ణీత సమయాల కేటాయింపు తప్పనిసరి అని ధర్మాసనం పేర్కొంది.